Many people have a habit.
Food gets stuck. They reach for a toothpick.
Some even use a safety pin.
It feels harmless. It is not.
Small Tools, Serious Damage
Toothpicks and safety pins may seem like quick solutions when food gets stuck, but both can quietly damage your teeth and gums. These sharp objects are not designed for oral care. Repeated use can injure soft tissues, disturb natural tooth contacts, and create long-term problems. What feels like relief for a few seconds can lead to lasting harm.
1. Toothpicks – Hidden Damage to Gums and Enamel
Frequent toothpick use can cause deep tissue injury, permanent gum recession, enamel wear near the gum line, and increased risk of infection from repeated irritation. Over time, this trauma exposes tooth roots, triggers sensitivity, and creates spaces where more food gets trapped.
2. Safety Pins – A Serious Risk to Oral Health
Safety pins can cause deeper tissue damage, permanent gum loss, severe sensitivity from root exposure, and infections that may lead to swelling or pus formation. Since they are metal and non-sterile, they introduce bacteria directly into injured gums and can weaken the supporting structures of teeth.
చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. పళ్ళ మధ్య ఏదైనా ఆహారం ఇరుక్కుంటే, వెంటనే ఒక టూత్‌పిక్ (Toothpick) తీసుకుంటారు. కొందరైతే ఏకంగా సేఫ్టీ పిన్ (Safety pin) కూడా వాడేస్తుంటారు. ఇది చూడ్డానికి చాలా చిన్న విషయమే అనిపిస్తుంది కానీ.. ఇది అస్సలు సేఫ్ కాదు.
చిన్న వస్తువులే.. కానీ తీవ్ర నష్టం
పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని తీయడానికి టూత్‌పిక్స్ లేదా సేఫ్టీ పిన్స్ వాడటం చాలా ఈజీగా అనిపించవచ్చు. కానీ అవి మీ పళ్ళను, చిగుళ్ళను చాలా సైలెంట్‌గా దెబ్బతీస్తాయి. ఇలాంటి పదునైన వస్తువులు నోటి శుభ్రత కోసం తయారు చేసినవి కావు. వీటిని పదే పదే వాడటం వల్ల కణజాలం (Tissues) దెబ్బతింటుంది, పళ్ళ మధ్య సహజంగా ఉండే అమరిక పాడవుతుంది, అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. కేవలం కొన్ని సెకన్ల పాటు ఉపశమనం కోసం చేసే ఈ పని.. శాశ్వత నష్టానికి దారితీస్తుంది.
1. టూత్‌పిక్స్ - చిగుళ్లు, ఎనామిల్‌కు దెబ్బ తరచుగా టూత్‌పిక్ వాడటం వల్ల చిగుళ్లు కిందికి జారిపోతాయి (Gum recession). అలాగే చిగుళ్ల దగ్గర పంటికి ఉండే ఎనామిల్ అరిగిపోతుంది. పదే పదే గుచ్చడం వల్ల చిగుళ్లు దెబ్బతిని ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాలక్రమేణా, ఇది పంటి వేర్లను (Tooth roots) బయటపడేలా చేస్తుంది. దీనివల్ల పళ్లు జలదరించడం (Sensitivity) మొదలవుతుంది, అలాగే పళ్ళ మధ్య మరింత ఆహారం ఇరుక్కునేలా ఖాళీలు ఏర్పడతాయి.
2. సేఫ్టీ పిన్స్ - నోటి ఆరోగ్యానికి తీవ్ర ముప్పు సేఫ్టీ పిన్స్ వల్ల చిగుళ్లలో మరింత లోపలికి గాయాలు అవుతాయి. పంటి వేర్లు బయటపడి తీవ్రమైన సెన్సిటివిటీ వస్తుంది. ఇన్ఫెక్షన్ల వల్ల చిగుళ్లలో వాపు రావడం, చీము పట్టడం కూడా జరగవచ్చు. ఇవి ఇనుముతో చేసినవి, పైగా స్టెరిలైజ్ (క్రిమిసంహారకం) చేసినవి కావు కాబట్టి.. దెబ్బతిన్న చిగుళ్ల ద్వారా బ్యాక్టీరియా నేరుగా లోపలికి ప్రవేశించి, పళ్ళను పట్టి ఉంచే ఎముకలను బలహీనపరుస్తుంది.